Bayyaram: బయ్యారం మండలం రామచంద్రాపురంలో పోలీసుల కార్డాన్ & సెర్చ్!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామచంద్రాపురం తండాలలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించి గుడుంబా, బెల్లం పానకం, 23 బైకులను సీజ్ చేశారు.
Bayyaram: బయ్యారం మండలం రామచంద్రాపురంలో పోలీసుల కార్డాన్ & సెర్చ్!
మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామపంచాయతీ లోని రామచంద్రపురం,కొత్త తండా, పెంకు తండాలలో గ్రామాలలో కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. గౌరవ SP Dr. శబరీష్ IPS ఆదేశానుసారం,DSP తిరుపతిరావు సూచనలతో గార్ల బయ్యారం CI రవీందర్ అధ్వర్మ్యలో కార్డాన్ సెర్చ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ... అసాంఘిక కార్యకలాపాలు, నిషేధిత గుడుంబా, నల్లబెల్లం, పట్టిక, గంజాయి ఇతర మత్తు పదార్థాల వినియోగం, సరైన పత్రాలు లేని వాహనాలు గుర్తించడం,అనుమానాస్పద వ్యక్తుల కదలికలు పై నిఘా ఉంచడం ఈ కార్డాన్ సెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం.కార్డాన్ అండ్ సెర్చ్ తో పాటు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయటం ద్వారా ప్రజలు - పోలీసులు సమష్టిగా నేరాలను అరికట్టవచ్చని , ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి రవాణా లేదా సేవించిన వారి సమాచారం పోలీసువారికి తెలియజేయాలని , తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని SI ప్రశాంత్ బాబు కోరారు.
ఇట్టి సెర్చ్ ఆపరేషన్లో 25 లీటర్ల గుడుంబా , 600 లీటర్ల బెల్లం పానకం , సరైన పత్రాలు లేని 23 ద్వీచక్ర వాహనాలు సీజ్ చేసి 6 గురు వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గార్ల బయ్యారం CI రవీందర్ ,గార్ల SI సాయి కుమార్, బయ్యారం ప్రశాంత్ బాబు ,రెండు మండలాల పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.




