Mahabubabad: డిజిటల్ అరెస్ట్ పేరుతో దోపిడీ: ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

Mahabubabad: పోలీసుల పేరుతో బంగారం వ్యాపారులను డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 21 Sept 2026 3:45 PM IST
Mahabubabad
X

Mahabubabad: డిజిటల్ అరెస్ట్ పేరుతో దోపిడీ: ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని పట్టణ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన మీడియా సమావేశం లో అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ శభరీష్ వెల్లడించారు.

ముఠా లోని మరో 3 రు పరారీలో ఉన్నారు. ఏ 1 నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన షేక్ ఇర్ఫాన్ 8 కేసుల్లో నిందితుడని , ఏ 2 చింతల చెరువు ప్రశాంత్ 6 కేసుల్లో నిందితుడని , వీరి నుంచి 2 సెల్ ఫోన్లు , పోలీస్ యూనిఫామ్ ను స్వాధీనం చేసుకున్నామని , 3 లక్షల రూపాయలు నిల్వ ఉన్న పలు బ్యాంకు అకౌంట్లను సీజ్ చేశామని తెలిపారు.

వీరు పోలీస్ యూనిఫామ్ తో ఉన్న ఫోటోను వాట్సాప్ , ట్రూ కాలర్ డీపి లలో పెట్టుకొని రెండు తెలుగు రాష్ట్రాల లోని పలువురు బంగారం వ్యాపారస్తులను బెదిరిస్తూ 4 లక్షల 20 వేల రూపాయలను వసూలు చేశారు. కేసముద్రం మండల కేంద్రం లోని బంగారం వ్యాపారస్తుడు బోగోజు.

వేణుగోపాల చారి కి ఫోన్ చేసి ఇద్దరు దొంగలు దొంగతనం చేసిన బంగారం మీకు అమ్మినారు , దానికి సంబంధించిన రసీదులు మా దగ్గర ఉన్నాయి , మీరు కొన్న బంగారం మాకు రికవరీ ఇవ్వకుంటే మేము వచ్చి అరెస్టు చేస్తాం , అరెస్టు చేస్తే మీ పరువు మర్యాదలు పోతాయి అని బెదిరించారు.

బంగారానికి సంబంధించిన డబ్బులు పంపించాలని వాట్సాప్ లో క్యూ ఆర్ కోడ్ పంపి 88 వేల రూపాయలు దోపిడీ చేశారు. అదే రోజు నేను మోసపోయానని గ్రహించి బాధితుడు కేసముద్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసముద్రం సీఐ సత్యనారాయణ సాంకేతికత , బ్యాంక్ స్టేట్మెంట్ల సహాయంతో కేసును చేధించారు.

డిజిటల్ అరెస్టులు ఉండవని , సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏ.పి.కే ఫైళ్లను ఓపెన్ చేయవద్దని , అపరిచిత వ్యక్తులతో అనవసరంగా ఫోన్ల లో మాట్లాడవద్దని ,వ్యక్తిగత వివరాలను అపరిచిత వ్యక్తులకు తెలియపరచవద్దని , అపరిచిత వ్యక్తులకు ఫోన్ పే , గూగుల్ పే చేయవద్దని , అపరిచిత వ్యక్తుల నుంచి డిజిటల్ అరెస్టుల పేరుతో ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

జిల్లాలో చట్ట వ్యతిరేఖ కార్య కలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసును చేదించిన పోలీసు సిబ్బందికి నగదు పురస్కారాలను అందించారు.

ఈ మీడియా సమావేశంలో డీఎస్పి తిరుపతిరావు , సి.ఐ సత్యనారాయణ , ఎస్.ఐ క్రాంతి కిరణ్ లు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad