Bayyaram: ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు మరో అవకాశం
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఓపెన్ విధానం ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును నవంబర్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది.
Bayyaram: ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు మరో అవకాశం
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలోని పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల బయ్యారం ప్రధానోపాధ్యాయులు ,A1 కోఆర్డినేటర్ M. ధనంజయ, అసిస్టెంట్ కోఆర్డినేటర్ G. దస్తగిరి తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఓపెన్ విధానం లో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదవాలనుకునే వారికి ప్రవేశాల కొరకు ఈ నెల 30 వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిందని చదువు మానివేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయడం ద్వారా విద్యార్హతలు పెంచుకోవాలని సూచించారు.
అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 30 వ తేదీ లోపు బాలుర ఉన్నత పాఠశాల లో సమర్పించాలని కోరారు. దరఖాస్తు తో పాటు ఆధార్ కార్డు, తాము చివరిగా చదివిన పాఠశాల బదిలీ ధృవీకరణ పత్రం (టి.సి), పాస్ పోర్ట్ సైజ్ రెండు ఫోటోలు ,పట్టిన తేదీ ధృవీకరణ పత్రం జత చేయాలని తెలిపారు.
పూర్తి వివరాల కోసం కోఆర్డినేటర్ M. ధనంజయ, సెల్ No.9949407795, అసిస్టెంట్ కోఆర్డినేటర్ G. దస్తగిరి, సెల్ No.9550634184 , B రమేష్ సెల్ No.8106602041 లను సంప్రదించాల్సింది గా కోరడమైనది.




