Mahabubabad: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి: సత్యవతి రాథోడ్!

Mahabubabad: మహబూబాబాద్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రిలే దీక్షకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, శంకర్ నాయక్ సంఘీభావం తెలిపి, సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 24 Oct 2026 4:41 PM IST
Mahabubabad
X

Mahabubabad: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి: సత్యవతి రాథోడ్!

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని తహశీల్దార్ కార్యాలయం సెంటర్ లో నేషనల్ హెల్త్ మిషన్ ( N.H.M ) ఉద్యోగుల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ , మాజీ జెడ్పీ చైర్ పర్సన్ బిందు , మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లతో సందర్శించి సంఘీభావం తెలిపారువారితో కలిసి భోజనాలు చేశారు.

ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల డిమాండ్స్ ను వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు 78 రకాల సేవలను అందిస్తున్నారని , వీరి సేవలతో మాతా శిశు మరణాలు తగ్గాయని , కోవిడ్ సమయం లో ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. దేశం లోని 8 రాష్ట్రాల్లో క్రమబద్ధీకరించారని , మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad