Mahabubabad: మహబూబాబాద్‌లో నిమజ్జన ఏర్పాట్లు పూర్తి: ఎమ్మెల్యే మురళీ నాయక్
Mahabubabad: మహబూబాబాద్ నిజాం చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్, డీఎస్పీలతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ పరిశీలించారు.
Mahabubabad: మహబూబాబాద్‌లో నిమజ్జన ఏర్పాట్లు పూర్తి: ఎమ్మెల్యే మురళీ నాయక్
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ పట్టణం లోని నిజాం చెరువు వద్ద వినాయక నిమజ్జనం ఏర్పాట్లను మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి , డీఎస్పీ తిరుపతి రావు , మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్ లతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని , ఫారెస్ట్ ఆఫీస్ సెంటర్ లో నిమజ్జనానికి తరలి వెళ్లే గణపతులకు స్వాగతం పలకనున్నామన్నారు.
ప్రవహించే నీటిలో వినాయకులను నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో మున్నేరు వాగు వద్ద వినాయక నిమజ్జనం , బతుకమ్మ ఘాట్ ల నిర్మాణంకు వారం రోజుల్లో పనులను ప్రారంభిస్తామని , 60 కోట్ల నిధులతో మహబూబాబాద్ పట్టణం లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని , త్వరలో మహబూబాబాద్ దశా..దిశా మారిపోనుందని అన్నారు. ఈ కార్యక్రమం లో పలువురు కౌన్సిలర్లు , కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.




