Mahabubabad: మహబూబాబాద్‌లో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించి ప్రతిభ పరీక్ష ప్రశ్నపత్రాలను ఆవిష్కరించారు.
Mahabubabad: మహబూబాబాద్‌లో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు
మహబూబాబాద్: విద్యార్థిని, విద్యార్థులలో సృజనాత్మాకత, శాస్త్రీయ ఆలోచన పెంచడంతో పాటు మూఢనమ్మకాలపై అవగహహన కల్పించేందుకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్.సీ కన్వెన్షన్ హల్ లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహించారు ... సీల్ చేసిన జిల్లా స్థాయి ప్రతిభ పరీక్ష మరియు ప్రశ్న పత్రాలను జే.వీ. వీ ప్రతినిధులు ఆవిష్కరించి విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్బంగా జే.వీ.వీ జిల్లా అధ్యక్షుడు చిర్ర యకాంతం మాట్లాడుతూ .... విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని,
శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమేగాకుండా మూఢనమ్మకాలను పారద్రోలడమే సైన్స్ ముఖ్య ఉద్దేశమన్నారు. నేర్చుకోవడం, పరిశీలించడం, ప్రశ్నించడం ప్రయోగించడం, నిరూపించడం అనే ఐదు సూత్రాల ద్వారా విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదుగుతారని ఆకాంక్షించారు.
ఈ పరీక్ష ద్వారా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థుల ను రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాల కు ఎంపిక చేస్తామన్నారు. ఈ చెకముఖి సైన్స్ సంబరాల సంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సంబరాలలో జే.వీ.వీ ప్రతినిధులు అప్పరావు, నాగయ్య, యాకయ్య, లు పాల్గొన్నారు.




