Mahabubabad: ఇండియన్ బ్యాంక్‌లో 800 గ్రాముల బంగారం చోరీ.. అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్!
Mahabubabad: మహబూబాబాద్ ఇండియన్ బ్యాంక్‌లో గోల్డ్ లోన్ ఆభరణాల చోరీ: 800 గ్రాముల బంగారం కాజేసిన అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ అరెస్ట్. ప్రైవేట్ ఫైనాన్స్‌లో పెట్టి రుణాలు తీసుకున్న వైనం.
Mahabubabad: ఇండియన్ బ్యాంక్‌లో 800 గ్రాముల బంగారం చోరీ.. అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్!
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఇండియన్ బ్యాంకు లో బంగారు ఆభరణాలను అపహరించిన అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ రాజేష్ ను మహబూబాబాద్ పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
బంగారు ఆభరణాలను బ్యాంక్ లో పెట్టి రుణాలు తీసుకున్న 22 మంది ఖాతాదారులకు చెందిన 800 గ్రాముల బంగారు ఆభరణాలను అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ తన వ్యక్తిగత అవసరాల కోసం లాకర్ లో నుంచి గుట్టు చప్పుడు కాకుండా చోరీ చేశాడు.చోరీ చేసిన బంగారు ఆభరణాలను ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ లో పెట్టి రుణాలు తీసుకున్నాడు.
ప్రతి నెల లో జరిగే బ్యాంక్ మేనేజర్ తనిఖీల్లో ఈ చోరీ విషయం బయటపడింది. చోరీ విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.




