Guduru: భీమునిపాదం ఈడీసీలో సంతకాల ఫోర్జరీ: నిధుల గోల్మాల్!
Guduru: మహబూబాబాద్ జిల్లా భీమునిపాదం జలపాతం వద్ద ఈకో డెవలప్మెంట్ కమిటీ (EDC) సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి రూ. 3.73 లక్షల నిధులు కాజేశారని చైర్మన్ రజిత ఆరోపించారు.
Guduru: భీమునిపాదం ఈడీసీలో సంతకాల ఫోర్జరీ: నిధుల గోల్మాల్!
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం, సీతనగరం పరిధిలోని భూమునిపాదం జలపాతం వద్ద గల ‘ఈకో డెవలప్మెంట్ కమిటీ’ (EDC)లో అటవీ శాఖ అధికారుల నిధుల అక్రమార్జన, అవినీతి పర్వం బయటపడింది.
కమిటీ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి భారీగా డబ్బులు కాజేసినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూమునిపాదం జలపాతం వద్ద పర్యాటకులకు అనుకూలమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు మరియు చెట్లు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు 5 గురు EDC కార్మికులను ఏర్పాటు చేశారు. అయితే, 01/04/2024 నుండి ఈ కార్మికులకు వేతనాలు అందలేదు. ఉన్నతాధికారుల నుండి అనుమతులు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, అటవీ శాఖ అధికారులు నిధుల మళ్లింపుకు పక్కా ప్రణాళిక రచించారు.
01/04/2026 నుండి 30/09/2026 వరకు 6 నెలల కాలానికి సంబంధించి కార్మికుల బకాయి వేతనాల పేరిట పెద్ద ఎత్తున నిధులను డ్రా చేసేందుకు తప్పుడు పత్రాలను సృష్టించారు అని గ్రామ సర్పంచ్, లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అక్రమ నిధుల లెక్కలు:
ఒక్కో కార్మికుడికి నెలకు వేతనం: ₹12,435/-
6 నెలల బకాయి వేతనం (ఒక్కరికి): ₹74,610/-
మొత్తం 5 గురు సభ్యులకు చెల్లించాల్సిన సొమ్ము: ₹3,73,050/- (మూడు లక్షల డెబ్బై మూడు వేల యాభై రూపాయలు). ఈ భారీ మొత్తాన్ని భూమునిపాదం EDC ప్రాజెక్ట్ ఖాతాలో ఉన్న నిల్వల నుండి డ్రా చేయడానికి కమిటీ సభ్యులు ఆమోదించినట్లుగా తప్పుడు కాగితాలు సిద్ధం చేశారు.
సంతకాల ఫోర్జరీ - సభ్యుల ఆగ్రహం:
తీర్మాన పత్రంలో కమిటీ సభ్యులైన M. అరుణ, A. రాములు, J. రజిత, ఎల్లమ్మ, T. శ్రీనివాస్, K. రాములు, J. శారద, G. వాణి, S. సుహాసినిలతో పాటు EDC చైర్మన్, వైస్ చైర్మన్ (CH. రామ) ల సంతకాలను అధికారులు ఫోర్జరీ చేసి నిధులు కాజేసినట్లు తెలుస్తోంది.
ఆ నిధులను రికవరీ చేయాలి - చైర్మన్ భూక్యా రజిత మంగీలాల్
గ్రామస్తులు, కమిటీ బాధ్యులు ఈ అవినీతిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అటవీ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భీముని పాదం ఇడిసి చైర్మన్ భూక్యా రజిత మంగీలాల్ కోరారు.తమ అనుమతి లేకుండా నిధులను కాజేసిన మాజీ చైర్మన్, అధికారుల నుండి నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.




