Bayyaram: బయ్యారం కాకతీయుల నాటి శివాలయంలో ఘనంగా జమ్మి పూజ

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జమ్మి పూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 20 Oct 2026 9:46 PM IST
Bayyaram
X

Bayyaram: బయ్యారం కాకతీయుల నాటి శివాలయంలో ఘనంగా జమ్మి పూజ

మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండల కేంద్రంలో అతి పురాతనమైన కాకతీయల కాలం నాటి శివాలయం కమిటీ ఆధ్వర్యంలో జమ్మి పూజా కార్యక్రమం నిర్వహించారు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ... గత కొన్ని సంవత్సరాల నుండి జమ్మి పూజా కార్యక్రమం శివాలయం కమిటీ ఆధ్వర్యం లో ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో భక్తులు,మహిళా సోదరీమణులు యువత అతిక సంఖ్యలో పాల్గొని జమ్మి పూజ కార్యక్రమం చేస్తున్నారు.

అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జమ్మి పూజ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పాండవులు మహాభారతంలో అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సందర్భంగా వారు ఆయుధాలను జమ్మి చెట్టు వద్ద పూజ చేసి అక్కడ జమ్మి చెట్టు కాడ వదిలేసి అజ్ఞాతవాసంలోకి వెళ్తారు అజ్ఞాతవాసం ముగించుకొని మళ్లీ జమ్మి చెట్టును పూజించి వారి ఆయుధాలను తీసుకొని మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంటారు.

అట్టివిద్యంలో కౌరవులను ఓడించి విజయం సాధిస్తారు అంటే జమ్మి చెట్టు పూజ చేసిన తర్వాత వారికి ఇంకా బలం చేకూరుతుంది అందుకే ప్రతి దసరా నాడు మనందరం జమ్మి చెట్టు వద్ద పూజ నిర్వహించి మనకున్న పనులలో విజయం సాధించాలని కోరుకుంటున్నాము అన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM