Garla: గార్లలో దసరా, బతుకమ్మ వేడుకలపై ఎస్ఐ హెచ్చరిక!
Garla: గార్లలో దసరా, బతుకమ్మ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ సాయికుమార్ విజ్ఞప్తి. డిజేలపై నిషేధం, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలని హెచ్చరిక.
Garla: గార్లలో దసరా, బతుకమ్మ వేడుకలపై ఎస్ఐ హెచ్చరిక!
Garla: గార్లలో దసరా, బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి - SI సాయికుమార్, మహబూబాబాద్ జిల్లా గార్ల మండల ప్రజలకు పోలీస్ శాఖ విజ్ఞప్తి. గార్లలో దసరా, బతుకమ్మ వేడుకలను ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గార్ల SI సాయికుమార్ తెలిపారు. దసరా మరియు దుర్గమ్మ మాత వేడుకలు రెండు పండుగలను ప్రశాంతంగా నిర్వహించాలని, ఎవరూ DJ లు పెట్టకూడదని, సౌండ్ పొల్యూషన్ కలిగించకూడదని ఆయన సూచించారు. నిబంధనలు అతిక్రమించి DJ లు పెట్టి, గొడవలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SI సాయికుమార్ హెచ్చరించారు. పండుగ వేడుకల్లో శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.




