Mahabubabad: సీరోలులో ఇత్తడి బిందెలు చోరీ మహిళ అరెస్ట్!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా సీరోలులో చెత్త సేేకరిస్తూ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్. ఇత్తడి బిందెలు స్వాధీనం, మరొకరి కోసం గాలింపు.
Mahabubabad: సీరోలులో ఇత్తడి బిందెలు చోరీ మహిళ అరెస్ట్!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో ఎల్లంపేట గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు చెత్త, ప్లాస్టిక్ బాటిల్లు, ప్లాస్టిక్ వ్యర్ధాలు సేకరించే క్రమంలో మండల కేంద్రంలోని ముడుసు సుమన్ ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న మూడు ఇత్తడి బిందెలు దొంగిలించేందుకు ప్రయత్నం చేయగా స్థానికులు వారిని గమనించి వారి వద్ద ఉన్న బస్తాలను చేసి చూడగా దానిలో వారు దొంగిలించిన ఇత్తడి బిందెలు బయటపడడంతో స్థానికులు ఒక మహిళను పట్టుకొగా మరొక మహిళ తప్పించుకొని పారిపోయింది. పట్టుకున్న మహిళను పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి దొంగతనానికి పాల్పడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.




