Mahabubabad: సీరోలు సమస్యలపై మహబూబాబాద్ కలెక్టర్‌కు వినతి
Mahabubabad: సీరోలు తహసీల్దార్ కార్యాలయానికి సర్వేయర్ నియామకం, ఎంపీడీవో భవన నిధుల మంజూరుపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.
Mahabubabad: సీరోలు సమస్యలపై మహబూబాబాద్ కలెక్టర్‌కు వినతి
మహబూబాబాద్ జిల్లా: ఈరోజు గౌరవనీయులైన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారిని గ్రీవెన్స్ సెల్‌లో కలిసి సీరోలు మండల కేంద్ర ప్రజలు మరియు రైతులు ఎదుర్కొంటున్న పలు ముఖ్య సమస్యలపై వినతిపత్రం అందజేయడం జరిగింది. ప్రధానంగా సీరోలు తహసీల్దార్ కార్యాలయానికి శాశ్వత భూ సర్వేయర్‌ను నియమించడంతో పాటు, సీరోలు మండల ప్రజా పరిషత్ (MPDO) కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది.
సీరోలు తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ లేకపోవడంతో రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది ముఖ్యంగా భూ వివాదాలు రెవెన్యూ మరియు కోర్టు పరిధిలో ఉన్న సమస్యలకు సర్వేయర్ నివేదికలు అవసరం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అందువల్ల సీరోలు తహసీల్దార్ కార్యాలయానికి సర్వేయర్‌ను త్వరగా నియమించాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది అలాగే ప్రస్తుతం మండల పరిషత్ కార్యాలయం సరైన సౌకర్యాలు లేని ప్రదేశంలో నిర్వహించబడుతున్నందున అధికారులు మరియు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సమస్యలు ఎదురవుతున్న విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
సీరోలు తహసీల్దార్ కార్యాలయం నిర్మాణానికి కేటాయించిన స్థలానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించి, అక్కడే మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని కోరడం జరిగింది తహసీల్దార్ కార్యాలయం మరియు మండల పరిషత్ కార్యాలయం ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉంటే, మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రెవెన్యూ పంచాయతీరాజ్ తదితర సమస్యల పరిష్కారం మరింత సులభతరం అవుతుందని వివరించడం జరిగింది
కలెక్టర్ గారి సానుకూల స్పందన
వినతిపత్రంలోని అంశాలను పూర్తిగా పరిశీలించిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు సీరోలు సర్వేయర్ సమస్యను త్వరలోనే పరిష్కరించి కొత్త సర్వేయర్‌ను నియమించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయానికి అవసరమైన భూమిని పరిశీలించి MPDO కార్యాలయ భవన నిర్మాణానికి మంజూరు. చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు తెలిపారు సీరోలు మండల ప్రజలు మరియు రైతుల సమస్యలను ఓపికగా విని వెంటనే సానుకూలంగా స్పందించిన గౌరవనీయులైన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారికి సీరోలు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము




