Mahabubabad: మహబూబాబాద్‌లో స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవు!

Mahabubabad: మహబూబాబాద్: వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యార్థుల భద్రత రీత్యా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించిన కలెక్టర్.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 24 Sept 2026 10:19 AM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవు!

Mahabubabad: బంగాళాఖాతం లో ఏర్పడిన వాయుగుండం కారణంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.మహబూబాబాద్ జిల్లా లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ స్నేహ శభరీష్ జిల్లా లోని ప్రభుత్వ , ప్రైవేట్ , ఎయిడెడ్ పాఠశాలలు , అంగన్వాడి కేంద్రాలకు సెలవు ప్రకటించారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. వరదలు , అత్యవసర సమయాలలో కంట్రోల్ రూమ్ నెంబర్ 7995074803 కు ఫోన్ చేయాలని కోరారు. నెల్లికుదురు మండల కేంద్రంలో అత్యధికంగా 108.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD