Garla: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి సీఐటీయూ
Garla: గార్లలో సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో. సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థులపై కేసులను ఎత్తివేయాలని శ్రీనివాస్ డిమాండ్.
Garla: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి సీఐటీయూ
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కేంద్రంలో ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక నెహ్రు సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 2023 నియమించిన విధంగానే ఎన్నికల అధికారి నియమకం జరపాలని, ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను బేషరత్ గా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వి. వెంకటేశ్వర్లు, సీఐటీయూ మండల అధ్యక్షులు అoబటి వీరస్వామి, కుంట రామకృష్ణ,కుంట రామకృష్ణ,డివైఎఫ్ఐ జిల్లా నాయకులు వి కొండయ్య, ఆల సంఘాల నాయకులు టీ నాగేశ్వరరావు,సీఐటీయూ సంఘాల జిల్లా నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.




