Mahabubabad: కలెక్టరేట్లో బాలల ప్రజావాణి.. సమస్యలు విన్నవించిన విద్యార్థులు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన పిల్లల ప్రజావాణిలో విద్యార్థులు తమ సమస్యలను అదనపు కలెక్టర్కు విన్నవించారు.
Mahabubabad: కలెక్టరేట్లో బాలల ప్రజావాణి.. సమస్యలు విన్నవించిన విద్యార్థులు
మహబూబాబాద్: బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పిల్లల ప్రజా వాణి కి జిల్లా నలుమూలల నుంచి పిల్లలు తరలివచ్చారు. తమ తమ పాఠశాలల్లో పడుతున్న ఇబ్బందులు , సమస్యలను పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ కు వినతి పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా పిల్లలు మాట్లాడుతూ......బ్యాగుల బరువుని మోయ లేకపోతున్నామని , ఇంటికి వెళ్లే వరకు అలసిపోతున్నామని ,
తమ తమ పాఠశాలల్లో 3 , 4 తరగతుల విద్యార్థులను ఒకే తరగతి గది లో కూర్చోబెడుతున్నారని , 200 నుంచి 250 మంది విద్యార్థులకు 1 నుంచి 3 మూత్రశాలలు ఉంటున్నాయని , పాఠశాల ఆవరణకు కాంపౌండ్ వాల్ లు లేవని , కోతులు బాగా ఉన్నాయని , ప్రభుత్వం వెంటనే స్పందించి అదనపు తరగతి గదులు , మూత్ర శాలలు , ప్రహరీ గోడలు నిర్మించి , కోతుల బెడదను నివారించాలని , బ్యాగుల మోత నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




