bayyaram: గౌరారం రోడ్డు నిర్మాణం కోసం బీఆర్ఎస్ ధర్నా
bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం నుండి వినోబా నగర్ వెళ్లే రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
bayyaram: గౌరారం రోడ్డు నిర్మాణం కోసం బీఆర్ఎస్ ధర్నా
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని గౌరారం గ్రామం నుండి వినోబా నగర్ గ్రామం కు వెళ్లే రోడ్డు ఫై ఉమ్మడి గౌరారం BRSపార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.
ఈ ధర్నా కార్యక్రమం ను ఉద్దేశించి BRS పార్టీ జిల్లా నాయకులు గంగుల సత్యనారాయణ, మండల నాయకులు మేకల ఉప్పలయ్య, యువ నాయకురాలు నానాభాల ఉమాదేవి మాట్లాడుతూ.. చొక్ల తండా నుండి గురిమల్ల వరకు ఉన్న బీటీ రోడ్డు ను రెన్యూవల్ కోసం గత BRS మాజీ ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియ నిధులు కేటాయించడం తో కాంట్రాక్టర్ రోడ్డు తవ్వడం జరిగింది.
కాని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వర్క్ కు వచ్చిన నిధులను రద్దు చేయడం వల్ల రోడ్డు నిర్మాణం ఆగిపోయింది, దానిఫై ప్రతి రోజు ఇటు మండల కేంద్రం కు , జిల్లా కేంద్రంకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యముగా గర్భిణీ స్త్రీలు, స్కూల్, కాలేజి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు , ఈ నాటి పాలకులు అధికారం లో కి వచ్చి మూడు ఏండ్లు అయినా కనీసం పట్టించు కున్న పాపనా పోలేదు అన్నారు.
ఇట్టి విషయం ను గౌరారం సర్పంచ్ లలిత మహేష్, గురిమల్ల సర్పంచ్ భద్రయ్య, స్థానిక ఎమ్మెల్యే కనకయ్య ఎన్ని సార్లు విన్నవించిన పట్టించు కోవడం లేదని, కలెక్టర్ ద్రుష్టి కి కూడా తీసుకెళ్లడం జరిగింది అయిన సమస్య పరిష్కారం కావడం లేదు, ఇప్పటికి అయినా ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
లేని పక్షం లో ఇంకా ఉద్యమాన్ని ఉదృతం చేస్తాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి పంచాయతీ BRS పార్టీ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.




