Bayyaram: బయ్యారంలో ఘనంగా తాతల ముత్తాతల నాటి ఆదివాసీ సంప్రదాయాలు!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో ఘనంగా ఆదివాసీల ఆచార సంప్రదాయాలు.
Bayyaram: బయ్యారంలో ఘనంగా తాతల ముత్తాతల నాటి ఆదివాసీ సంప్రదాయాలు!
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీలోని కొమరం భీమ్ కాలనీలో ఆదివాసి కమ్యూనిటీ ఆధ్వర్యంలో తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాల ప్రకారం గ్రామ పెద్దల ఎంపిక కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు సమ్మక్క సారక్క తల్లుల గద్దెల దగ్గర తాతల ముత్తాతల కాలంనాటి ఆనవాయితీగా పునరావృతం చేస్తూ గ్రామానికి దొర, పటేల్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, సమ్మక్క సారక్క తల్లుల సాక్షిగా గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించిన ఎన్నికల్లో నూతన దొర గా మెస్సు, రాజశేఖర్, పటేల్ గా పులుషం రమేష్ లను ఏకగ్రీవంగా గ్రామ పెద్దలుగా కొట్టెం పుల్లయ్య ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు,
దొర, పటేల్, పెద్దలు, మాట్లాడుతూ.. మన ఆదివాసి కులదైయమైన సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని , తల్లుల దీవెన తీసుకుని గ్రామంలోని ప్రజలను చల్లగా, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది, తల్లుల గద్దెల సమీపంలో మొక్కలను నాటి, మొక్కలు నాటడం వల్ల కాలుష్యం నివారించవచ్చని, వర్షాలు పడేందుకు చెట్లు దోహదపడతాయని అన్నారు, ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఒక చెట్టు నాటుకోవాలని తెలియజేశారు, మన సంస్కృతి సంప్రదాయాలను, పురాతన ఆచారాలను, కాపాడుకుంటూ, రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు, ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ కాలనీ గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




