Bayyaram: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అన్యాయం: కలెక్టర్‌కు వినతి!
Bayyaram: ROFR అటవీ హక్కు పట్టాలు ఉన్నాయనే నెపంతో ఇందిరమ్మ ఇళ్లు నిరాకరించడం అన్యాయమని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కాచనపల్లి గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
Bayyaram: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అన్యాయం: కలెక్టర్‌కు వినతి!
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కాచనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరులో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. కాచనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్షిక రాజు, ఎస్.కె. యూసుఫ్, బానోతు రాంబాబు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.
గ్రామస్తుల ఆవేదన..
"మా గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వెరిఫికేషన్ కు వచ్చిన గ్రామపంచాయతీ సెక్రెటరీ గారు 'మీకు రేకుల ఇళ్లు ఉన్నాయి, ROFR పట్టా భూములు, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది, అందుకే ఇళ్లు రావు' అని చెబుతున్నారు" అని లబ్ధిదారులు వాపోయారు.
"మాది ఏజెన్సీ ప్రాంతం. మాకున్నవి కేవలం అడవి హక్కు పట్టాలే (ROFR). ఇవి వర్షాధార భూములు, మార్కెట్ విలువ లేనివి. ఈ పట్టాలు ఉన్నాయనే కారణంతో ఇళ్లు నిరాకరించడం అన్యాయం. మేమంతా కూలి పనులు చేసుకుని జీవించే పేదలం" అని గ్రామస్తులు కలెక్టర్ మొరపెట్టుకున్నారు. అటవీ హక్కు పట్టాలు ఉన్న పేద గిరిజనులకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, మాకు న్యాయం చేయాలని కోరారు.




