Bayyaram: బయ్యారంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం బాలికల ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
Bayyaram: బయ్యారంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం!
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో "బేటీ బచావో - బేటీ పఢావో"' కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బయ్యారం బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల ఇన్‌ఛార్జి ఉపాధ్యాయురాలు లావణ్య అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా "బేటీ బచావో - బేటీ పఢావో" కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ బాలికల రక్షణ, విద్య, సాధికారత, లింగ సమానత్వంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
బాలికలు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, వారికి సమాన అవకాశాలు కల్పించాలని, బాలికల పట్ల వివక్షను రూపుమాపి వారి ఉజ్వల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు.
బాలికల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు బాలికల విద్య, హక్కులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో 'బేటీ బచావో - బేటీ పఢావో' అంశంపై డ్రాయింగ్, పాటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం కో-ఆర్డినేటర్ మహేశ్వరి, అరుణ, సంధ్యారాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.




