Mahabubabad: సీతానగరం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరు సీతానగరం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు; సాంప్రదాయ దుస్తుల్లో నృత్యాలతో అలరించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు.

B NARASIMHA, GUDUR
Published on: 9 Oct 2026 7:27 PM IST
Mahabubabad
X

Mahabubabad: సీతానగరం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!

Mahabubabad: గూడూరు (hmtv) మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం,ఎంపీపీఎస్ సీతానగరం ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.

ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం, ఐక్యతాభావం పెంపొందుతాయని తెలిపారు.పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొనగా,విద్యార్థులు ఆనందోత్సాహాలతో బతుకమ్మ పాటలకు విద్యార్థులతో కలిసి ఊపాధ్యాయులు,ఆశ వర్కర్స్, అంగన్వాడీ సిబ్బంది నృత్యాలు చేసారు.ఈ కార్యక్రమం లో చర్ప దేవి,జన్ను రాజమౌళి,కమల,శ్రీలత, కవిత,పద్మ,రమ, వీరమ్మ, లక్ష్మి లు పాల్గొన్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR