Maripeda: మరిపెడ జీ ఎన్ రెడ్డి హైస్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు!

Maripeda: మహబూబాబాద్ జిల్లా మరిపెడ జీఎన్ రెడ్డి మెమోరియల్ హైస్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు; సాంప్రదాయ పాటలతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 9 Oct 2026 7:43 PM IST
Maripeda
X

Maripeda: మరిపెడ జీ ఎన్ రెడ్డి హైస్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు!

Maripeda: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని జీ ఎన్ రెడ్డి మెమోరియల్ హైస్కూల్‌లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాల చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు, టీచర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకున్నారు. పాటలు, ఆటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL