Mahabubabad: పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో 3 పతకాలు సాధించిన ఏఆర్ డీఎస్పీలు!
Mahabubabad: తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో టెన్నిస్ పోటీల్లో మహబూబాబాద్ ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్ ఒక బంగారం, రెండు రజత పతకాలు సాధించారు.
Mahabubabad: పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో 3 పతకాలు సాధించిన ఏఆర్ డీఎస్పీలు!
Mahabubabad: తెలంగాణ పోలీస్ అకాడమీ, హైదరాబాద్‌లో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో టెన్నిస్ పోటీల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏ.ఆర్. డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్ ప్రతిభ కనబరిచి ఒక బంగారు, రెండు రజత పతకాలు సాధించారు.
సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో టెన్నిస్ విభాగంలో డబుల్స్‌లో బంగారు పతకం, ఓపెన్ సింగిల్స్‌లో రజత పతకం, ఓపెన్ డబుల్స్‌లో రజత పతకం సాధించారు.
ఈ సందర్భంగా పతకాలు సాధించిన ఏ.ఆర్. డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్ ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ పతకాలను పరిశీలించి, డీఎస్పీలను అభినందించారు.
పోలీసు విధులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచి మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖకు గౌరవం తీసుకురావడం అభినందనీయమని ఎస్పీ డా. శబరీష్ పేర్కొన్నారు.
పోలీసు సిబ్బంది విధి నిర్వహణతో పాటు శారీరక దారుఢ్యం, క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడల్లో మరింతగా రాణిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని డీఎస్పీలను ఎస్పీ ప్రోత్సహించారు.




