Mahabubabad: ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ఆకునూరి మురళి ఆగ్రహం

Mahabubabad: ప్రభుత్వ బడుల్లో వసతులు లేకనే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్న మాజీ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. ప్రైవేట్ ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్.

A.Rajkumar, Mahabubabad
Published on: 16 Sept 2026 8:57 PM IST
Mahabubabad
X

Mahabubabad: ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ఆకునూరి మురళి ఆగ్రహం

మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు సరిగా లేకపోవడం, తోనే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోందని మాజీ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ అన్నారు.

తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ చేపట్టిన బస్సు యాత్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. మురళీ బృందం పట్టణం లోని కంకరబోడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించారు. పాఠశాలలో కలియ తిరుగుతూ మూత్ర శాలలు , మరుగు దొడ్లు , పాఠశాల ఆవరణను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో దేశాలు తిరిగానని , ఇంత వదిలేసిన , ఇంత నిర్లక్ష్యం గల పాఠశాలలను ఎక్కడా చూడలేదని , ఇలాంటి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని ప్రజలకు తెలియజేసేందుకే ఈ బస్సు యాత్రను చేపట్టామని , సమస్యలు తీరేంతవరకు తిరుగుతామని , రంగారెడ్డి జిల్లా ఆరుట్ల లో 52 అంశాలతో ఓ స్కూల్ ని కట్టించామని , విద్యార్థులు 600 నుంచి 2200 వరకు పెరిగారన్నారు.

విద్యకు 18 నిధులు కేటాయించాలని , ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ బాగా ఉందని ఫీజు రెగ్యులేషన్ చేయాలని , ఇండిపెండెంట్ కమీషన్ ను వేయాలని డిమాండ్ చేశారు. ఈ యాత్రలో పలువురు విద్యావేత్తలు , మేధావులు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad