Mahabubabad: కేసముద్రం శివారులో 108 జంటలతో సత్యనారాయణ స్వామి వ్రతం

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం శివారు ఉసిరితోటలో 108 జంటలతో సత్యనారాయణ స్వామి వ్రతాలు, వనసమారాధన; పాల్గొన్న 2 వేల మంది భక్తులు.

A.Rajkumar, Mahabubabad
Published on: 22 Nov 2026 8:32 PM IST
Mahabubabad
X

Mahabubabad: కేసముద్రం శివారులో 108 జంటలతో సత్యనారాయణ స్వామి వ్రతం

మహబూబాబాద్: కార్తిక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల శివారు ఉసిరితోట లో లోక కళ్యాణార్థం108 మంది దంపతులచే సాముహిక శ్రీ రమసత్యనారాయణ స్వామి వ్రతాలు వనసమారాధన మహోత్సవం వైభవంగా నిర్వహించారు.

తొలుత శ్రీ సత్యనారాయణ స్వామి వారికి విశేష అలంకరణలు మంగళ వాయిద్యాలు వేలాది మంది భక్తుల నడుమ వేదపండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్ఛారణల నడుమ వెల్లు వేత్తిన భక్తి పారవశ్యం మధ్య సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు.

ఈ వ్రతాలు ఆచరించడం వలన భక్తులు కోరిన కోరికలు నెరవేరి ఆర్థిక ఇబ్బందులు శత్రు బాధలు తొలగి ఆయురారోగ్యాలతో జీవిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో పవిత్రత అంతకు మించిన మహత్యం తో కూడిన సత్యనారాయణ స్వామి వ్రత మహత్యం ప్రక్రియ పౌరాణికంగా ఎంతో శక్తివంతమైనది. అనంతరం భక్తులకు ప్రీతిపాత్రమైన కార్తిక మాసంలో వనసమారాధాన మహోత్సవంలో రెండు వేల మంది భక్తులు పాల్గొని సామూహిక వనభోజనం చేశారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad