Mulugu: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి వామపక్షాల భారీ ధర్నా!

Mulugu: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని ములుగు జాతీయ రహదారిపై వామపక్షాల ర్యాలీ, ధర్నా.

PONNALA SWAMY, MULUGU
Published on: 1 Oct 2026 6:18 PM IST
Mulugu
X

Mulugu: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి వామపక్షాల భారీ ధర్నా!

Mulugu: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే తొలగించాలని , ఎస్ఐఆర్‌ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ములుగు జిల్లా కేంద్రంలో వామపక్షాలు ములుగు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం ముందు ధర్నా చేశారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, సిపిఐ జిల్లా నాయకులు జంపాల రవీందర్, ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి గుండెబోయిన చంద్రయ్య మాట్లాడుతూ SIR ప్రక్రియలో అన్యాయంగా తొలగించబడిన నిజమైన ఓటర్లందరినీ తిరిగి చేర్చాలని వారు డిమాండ్ చేశారు.సీఈసీ మరియు ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని రద్దు చేయాలని ,మరియు ఈసీల నియామకంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని వారు డిమాండ్ చేశారు. ఓటర్లను ప్రణాళిక ప్రకారంగానే బిజెపి ఎన్నికల కమిషన్ కుమ్మక్కై తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ యొక్క ఏకపక్ష నిర్ణయాల వలన ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి రత్నం రాజేందర్, చిట్టిబాబు, మల్లారెడ్డి , ఆగి రెడ్డి,రత్నం ప్రవీణ్ ,అల్వాల ఐలయ్య, దేవేందర్, సిపిఐ నాయకులు ముత్యాల రాజు, బండి నరసయ్య, నటరాజ్, ఎంసిపిఐయు నాయకులు సుధాకర్, వెంకన్న, ఆదిరెడ్డి, పోషాలు తదితరులు పాల్గొన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU