Nagarkurnool: అధికార దుర్వినియోగానికి పాల్పడి రైతు భూమి కబ్జా.!

Nagarkurnool: తాడూరులో చిన్న రైతు భూమిని అక్రమంగా కబ్జా చేశారంటూ ఉప్పునుంతల తహశీల్దార్ కార్యాలయ ఏఎస్‌వోపై అచ్చంపేట సబ్ కలెక్టర్‌కు బాధితుడు ఫిర్యాదు చేశారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 18 Oct 2026 1:38 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: అధికార దుర్వినియోగానికి పాల్పడి రైతు భూమి కబ్జా.!

Nagarkurnool: భూ భారతి చట్టం - 2025 ను ఉల్లంఘించి చిన్న రైతు భూమిని అక్రమంగా కబ్జా - ఉప్పునుంతల తహశీల్దార్ కార్యాలయ ASO పై ఫిర్యాదు. అచ్చంపేట డివిజన్, తాడూర్ గ్రామ సర్వే నెం. 336/1 లో 1-00 ఎకరం భూమి వివాదం వెలుగులోకి వచ్చింది.

తాడూర్ కు చెందిన నిరుపేద చిన్న రైతు గుండెమోని వెంకటయ్య తండ్రి నారయ్య తన 1-00 ఎకరం భూమిని అక్రమంగా లాక్కున్నారని సబ్ కలెక్టర్ (రెవెన్యూ) అచ్చంపేట గారికి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు సారాంశం:

బాధితుడు గుండెమోని వెంకటయ్యకు తండ్రి నారయ్య నుండి 2-00 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. అందులో 1-00 ఎకరం తన పేరిట రిజిస్టర్ అయి, తానే ఇప్పటివరకు సాగు చేసుకుంటున్నాడు.

తనకు వరుస అయ్యే, ప్రస్తుతం ఉప్పునుంతల తహశీల్దార్ కార్యాలయంలో ASO గా పని చేస్తున్న గుండెమోని సాయిబాబా (సెల్: 7731869324) తన ASO అధికారాన్ని దుర్వినియోగం చేసి, 2012 నుండి భూ భారతి చట్టం-2025 ను ఉల్లంఘించి, వెంకటయ్యకు తెలియకుండా ఆ 1-00 ఎకరం భూమిని తన పేరిట మార్పించుకున్నాడని బాధితులు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు

బాధితుడు తెలిసి అడగగా, ఆ భూమిని తన సమీప బంధువు అయిన తాళ్లచెట్టిపల్లికి చెందిన ఆత్లమ్మ జుబ్బు నారమ్మ భర్త నిరంజన్ పేరిట బినామీ రిజిస్ట్రేషన్ చేయించాడు. దీనిపై తహశీల్దార్ గారు నోటీస్ నెం. బి/744/2026, తేదీ 29.09.2026 జారీ చేసినా, చర్యలు తీసుకోలేదు.

ఇది తెలంగాణ భూ భారతి -2025 ఉల్లంఘన, ప్రభుత్వ ఉద్యోగి తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం, నమ్మకద్రోహమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితుని డిమాండ్లు:

1. ASO గుండెమోని సాయిబాబా పై వెంటనే శాఖాపరమైన విచారణ జరిపి సస్పెండ్ చేయాలి.

2. క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.

3. 2012 నుండి జరిగిన అక్రమ మ్యుటేషన్ మరియు బినామీ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి, సర్వే నెం. 336/1 లోని 1-00 ఎకరం భూమిని తిరిగి గుండెమోని వెంకటయ్య తండ్రి నారయ్య పేరిట పునరుద్ధరించాలి.

4. విచారణ పూర్తయ్యే వరకు ఆ భూమిపై ఎలాంటి క్రయవిక్రయాలు జరగకుండా నిషేధం విధించాలి

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA