Warangal: కోట వెంకటాపూర్లో గణనాథుడిని దర్శించుకున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి!
Warangal: సంగెం మండలం కోట వెంకటాపూర్లో గణనాథుడిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి. ప్రత్యేక పూజలు చేసి, మహా అన్నదానంలో అన్నప్రసాద వితరణ.
Warangal: కోట వెంకటాపూర్లో గణనాథుడిని దర్శించుకున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి!
వరంగల్, సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం కోట వెంకటాపూర్ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గణనాథుడిని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పరకాల పిసిసి మెంబర్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ... విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రైతాంగం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను, గ్రామస్తులను ఆయన అభినందించారు.




