Warangal: వరంగల్ అక్కినేని ఫ్యాన్స్‌తో కింగ్ నాగార్జున ఫోటోషూట్

Warangal: హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిగ్ బాస్ సెట్‌లో వరంగల్ జిల్లా అక్కినేని అభిమానులకు కింగ్ నాగార్జున ప్రత్యేక ఫోటోషూట్ ఇచ్చి మాట్లాడారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 11 Oct 2026 3:42 PM IST
Warangal
X

Warangal: వరంగల్ అక్కినేని ఫ్యాన్స్‌తో కింగ్ నాగార్జున ఫోటోషూట్

వరంగల్ జిల్లా: ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాలలో బిగ్ బాస్ షో సందర్భంగా అక్కినేని నాగార్జున వరంగల్ జిల్లా ఫ్యాన్స్ కు ఫోటోషూట్ ఇచ్చారు.

కింగ్ నాగార్జున 100వ చిత్రం "కింగ్ 100" త్వరలో విడుదల కాబోతుందని, ఈ చిత్రం అభిమానులకు పండగలా ఉంటుందని, బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని నాగార్జున తెలిపారు.

ఈ సందర్భంగా వరంగల్ జిల్లా అభిమానులు అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ ఫోటో ఉన్న గిఫ్ట్ ను నాగార్జునకి అందజేశారు. చాలా దూరం నుంచి వచ్చారని, సేఫ్ గా వరంగల్ చేరుకోవాలని, దూరం నుంచి వచ్చినందుకు థాంక్స్ అని నాగార్జున అభిమానులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అక్కినేని ఫ్యాన్స్ అధ్యక్షులు సదాంత్ కొడకండ్ల, ఆకుతోట సాగర్, మార్గంరాజ్ కుమార్, గిరి, అశోక్, జనార్ధన్, పిట్ట భరత్, ప్రసాద్, పోలేపాక నరేష్, ఇజ్జగిరి భీమ్రాజ్, జావిద్, గద్దల శివకుమార్, జయప్రకాష్, మహేందర్ రెడ్డి, రమేష్ (మడికొండ), రాజేష్, కిరణ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST