Mallampally: ఘనంగా కేతి బచావో అభియాన్ సాగుభూమి సంరక్షణ సమావేశం!

Mallampally: మల్లంపల్లి గ్రామంలో కేతి బచావో అభియాన్ సమావేశం. ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు, డ్రోన్ ద్వారా నానో ఎరువుల పిచికారీపై రైతులకు అవగాహన.

Narender, Staff Reporter  -Warangal
Published on: 4 Nov 2026 8:57 AM IST
Mallampally
X

Mallampally: ఘనంగా కేతి బచావో అభియాన్ సాగుభూమి సంరక్షణ సమావేశం!

Mallampally: కేతి బచావో అభియాన్ (సాగుభూమి సంరక్షణ కార్యక్రమం) సమావేశం మల్లంపల్లి గ్రామం లో చిట్టిరెడ్డి మల్లారెడ్డి మిరప మల్చింగ్ క్షేత్రం నందు నవంబర్ 3 వ తేదీ మంగళ వారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎల్నినో ప్రభవంతో తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున నీటి లభ్యతకు అనుగుణంగా తక్కువ నీటితో సాగు అయ్యే స్వల్పకాలంలో చేతికి vache ప్రత్యామ్నాయ వేసే ఆరుతడి పంటల గురించి వివరించడం జరిగిందీఈ సమావేశంకి కృషీ విజ్ఞాన కేంద్రం శాస్త్ర వేత్తలు డా అరుణజ్యోతి ,రాజు, విజయభాస్కర్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్ర వేత్త విశ్వతేజ , ఇఫ్కో కంపెనీ మేనేజర్ విశాల్ షిండే డ్రోన్ ద్వారా నానో ఎరువుల స్ప్రే చెయ్యడం జరిగింది ముఖ్య అతిథిగా ఆత్మ చైర్మన్ రవీందర్ రెడ్డి,గారు పాల్గొనడం జరిగింది కార్యక్రమం లోసర్పంచ్ శ్యామరావు ,మండల వ్యవసాయ అధికారి శ్రీధర్ aeo జ్యోతిరానీ, రైతులు గొర్రె కుమార్, రవిబాబు, సాంబయ్య,మల్లారెడ్డి, చంద్రయా, శ్రీనివాస్ రెడ్డి,ఇటుకల కరుణాకర్ , సంజీవ్ రావు, రాజు, బిక్షపతి ఇతర రైతులు పాల్గొనడం జరిగింది

ఈక్రింది విషయాలపై రైతులకు అవగాహన కల్పించడం జరేగింది.

1,నేల పరీక్ష ఆధారిత పోషక యాజమాన్యం.

2,ఎరువుల సమతుల్య వినియోగం.

3,ప్రకృతి వ్యవసాయం.

4,పంట వ్యర్థాల నిర్వహణ.

5,సమీకృత తెగుళ్ల నిర్వహణ నేల ఆరోగ్య కార్డు వినియోగం.

6,సమీకృత పోషక నిర్వహణ.

7,వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం.

8,పంటల మార్పిడి లేదా వైవిధ్యీకరణ స్థిరమైన వ్యవసాయ పద్ధతులు.

9,నీటి పొదుపుతో ప్రతి చుక్కకు అధిక పంట.

10,సేంద్రీయ జీవ ఉత్పత్తుల వినియోగం.

11. పశుగ్రాస పంట ల గురించి వివరించడం.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.