Kesamudram: కేసముద్రంలో బీజేపీ రక్తదాన శిబిరం: 40 మంది రక్తదానం!

Kesamudram: మోదీ ప్రజా జీవితానికి 25 ఏళ్లు కేసముద్రంలో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో "సేవా సంకల్ప్ అభియాన్" రక్తదాన యజ్ఞం 40 మంది రక్తదానం.. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు హాజరు.

A.Rajkumar, Mahabubabad
Published on: 3 Oct 2026 5:29 PM IST
Kesamudram
X

Kesamudram: కేసముద్రంలో బీజేపీ రక్తదాన శిబిరం: 40 మంది రక్తదానం!

కేసముద్రం: కేసముద్రంలో ఘనంగా "సేవా సంకల్ప్ అభియాన్" మహా రక్తదాన శిబిరం – 40 మంది రక్తదానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రజా జీవితం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభసందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా యువమోర్చా (BJYM), భారతీయ జనతా పార్టీ (BJP) కేసముద్రం మండల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో "సేవా సంకల్ప్ అభియాన్" లో భాగంగా ఒక మహా రక్తదాన శిబిరాన్ని (రక్తదాన యజ్ఞం) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.

కేసముద్రం మండల బీజేవైఎం అధ్యక్షులు భూక్య విజయ్, బీజేపీ మండల అధ్యక్షులు ఉప్పునూతుల రమేష్ ల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, హనుమకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ మార్తినేని ధర్మారావు , జిల్లా బీజేపీ అధ్యక్షులు వల్లభు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వద్దిరాజు రామచందర్రావు మరియు కేసముద్రం ఎంపీడీవో క్రాంతి గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. సమాజ సేవలో రక్తదానం అత్యంత పవిత్రమైనదని, ప్రాణాపాయంలో ఉన్న ఎంతోమందికి ఇది పునర్జన్మను ప్రసాదిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ గారి 25 ఏళ్ల నిరంతర ప్రజా సేవకు గుర్తుగా ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో యువతీ యువకులు, పార్టీ శ్రేణులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. మొత్తం 40 మంది దాతలు ముందుకు వచ్చి, ఒక్కొక్కరు 300 మి.లీ. చొప్పున రక్తదానం చేయడం విశేషం.

ఈ రక్తదాన శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ స్పందన, డాక్టర్ సుభాషిని, డాక్టర్ శివరాం మరియు ల్యాబ్ సాంకేతిక సిబ్బంది పాల్గొని రక్త సేకరణను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గూగులోత్ మదన్, బీజేవైఎం జిల్లా ఇన్‌ఛార్జ్ తాళ్లపల్లి నిఖిల్ రావు , బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దిడ్డి మ హేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పొదిల నరసింహారెడ్డి, నాయకులు, మాధవ పెద్ది శశివర్ధన్ రెడ్డి, గుగులోత్ రాంబాబు, గుడూరు మండల అధ్యక్షులు, రాసమల్ల వెంకన్న,

నెల్లికుదురు మండల అధ్యక్షులు రాజ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి బానోతు రాము, మంగి శెట్టి నాగయ్య బోడ వెంకన్న, యాకూబ్, ముదిరెడ్డి మురళీధర్ రెడ్డి, గుండు దామోదర్, గాంతి వెంకట్ రెడ్డి, జాటోత్ నరేష్, వాంకుడోత్ నరేష్, బానోత్ రమేష్ లతో వెలుపుల ఐలయ్య, దేశబోయిన కుమార్ ,వేల్పుల ఐలయ్య, మంగి శెట్టి నాగయ్య,బానోత్ సురేందర్, పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, యువకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad