Kazipet: కాజీపేటలో హనుమాన్ విగ్రహ తొలగింపు దుర్మార్గం: పద్మా రెడ్డి
Kazipet: కాజీపేట వడ్డెర కాలనీలో అర్ధరాత్రి హనుమాన్ విగ్రహం తొలగించడం దుర్మార్గమని, విగ్రహాన్ని పునఃప్రతిష్టించే దాకా పోరాడతామని రావు పద్మా రెడ్డి స్పష్టం చేశారు.
Kazipet: కాజీపేటలో హనుమాన్ విగ్రహ తొలగింపు దుర్మార్గం: పద్మా రెడ్డి
కాజీపేట: కాజీపేట సోమిడి విష్ణుపురి కాలనీలోని వడ్డెర కాలనీలో దాదాపు వంద కుటుంబాలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక చిన్న గద్దె ఏర్పాటు చేసుకొని జెండా ఎగురవేస్తూ, వినాయక, హనుమాన్ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
ఏ ప్లాట్కూ ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న హనుమాన్ విగ్రహాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు, పోలీసులు అందరూ కలిసి రాత్రికి రాత్రే అక్రమంగా తొలగించడం అత్యంత దుర్మార్గమని రావు పద్మా రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఇతర మతాలకు చెందిన జెండాలు పెడితే తొలగించలేని వారు, హిందువుల విషయానికి వచ్చేసరికి ఇలాంటి అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మొన్న శాయంపేటలో, నిన్న హైదరాబాద్లో శ్రీరాముని విగ్రహాలు, నేడు కాజీపేటలో హనుమాన్ విగ్రహాల తొలగింపు చూస్తుంటే... కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని స్పష్టమవుతోందని అన్నారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, ఒకే వర్గానికి కొమ్ముకాస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన సమయం వచ్చినప్పుడు హిందూ సమాజం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో బాధితులకు మద్దతుగా సంఘటనా స్థలానికి వెళ్తున్న రావు పద్మా రెడ్డి గారిని సుబేదారి SHO ఆధ్వర్యంలో పోలీసులు గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్) చేయడం అప్రజాస్వామికంమని, ఎన్ని అరెస్టులు చేసినా, ఎంతగా నొక్కిపట్టాలని చూసినా భక్తుల తరఫున, ధర్మ పరిరక్షణ కోసం మా పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.
కాజీపేట వడ్డెర కాలనీలో తొలగించిన స్థానంలో మళ్లీ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించే వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, కార్యకర్తలు, ప్రజలు మరియు హిందూ సంఘాలతో కలిసి మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని రావు పద్మా రెడ్డి తేల్చిచెప్పారు.




