Bhupalpally: రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు!

Bhupalpally: కాటారంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటన. గణపతి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించిన మంత్రి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Sept 2026 4:05 PM IST
Bhupalpally
X

Bhupalpally: రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు!

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాటారం మండల కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణపతి మండపాలను సందర్శించారు.

గణపతి మండపాల వద్ద మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని గణపతి దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. మంత్రి పర్యటన సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు, భక్తులు ఆయనకు స్వాగతం పలికారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్