Kamareddy: పత్లపూర్ గ్రామంలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం!

Kamareddy: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పత్లపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం. రాజ్యాంగ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించిన తహసీల్దార్ వేణు గోపాల్ గౌడ్.

VEERANNA, JUKKAL
Published on: 30 Oct 2026 5:28 PM IST
Kamareddy
X

Kamareddy: పత్లపూర్ గ్రామంలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం!

Kamareddy: పత్ల పూర్ (కామారెడ్డి ) భారత రాజ్యాంగం ప్రకారం కుల, మత,వర్గ, ప్రాంతీయ భేదలులేకుండాసమాజంలోని ప్రతి పౌరుడినిసమానంగా గౌరవించాలని, ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగంకల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరు పూర్తి అవగాహన కల్గి ఉండాలని బిచ్కుంద తహసీల్దార్ బి. వేణు గోపాల్ గౌడ్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండలం లొని పత్ల పూర్ గ్రామం లో పౌర హక్కుల దినోత్సవ సందర్బంగా పౌర హక్కులపైప్రజలకుఅవగాహనకల్పించారు.

తహసీల్దార్ మాట్లాడుతు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమాజం లొని ప్రతి పౌరుడికి దక్కల్సిన సమాన గౌరవం,సమానత్వం తదితర అంశాలపై రెవెన్యూ అధికారులు, పోలీస్ లు శాఖ వారు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మచ్కురి పద్మిని బాయి,ఉప సర్పంచ్ రాజ్ కుమార్, ఎం ఆర్ ఐ అంజయ్య లతోపాటు పోలీస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL