Mallampally: పేదల పాలిట వరంగా కల్యాణలక్ష్మి పథకం బీఆర్‌ఎస్ నేత బడే నాగజ్యోతి!

Mallampally: కల్యాణలక్ష్మి పథకం ప్రారంభమైన అక్టోబర్ 2ను పురస్కరించుకుని మల్లంపల్లి భాగ్యనగర్ తండాలో శుక్రవారం కేసీఆర్‌కు కృతజ్ఞత కార్యక్రమం: బడే నాగజ్యోతి.

PONNALA SWAMY, MULUGU
Published on: 1 Oct 2026 7:20 PM IST
Mallampally
X

Mallampally: పేదల పాలిట వరంగా కల్యాణలక్ష్మి పథకం బీఆర్‌ఎస్ నేత బడే నాగజ్యోతి!

Mallampally: తెలంగాణలో పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించిందని బీఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి తెలిపారు. పేద కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందిస్తూ ఈ పథకం ఎంతోమంది కుటుంబాలకు అండగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకం ప్రారంభమైన అక్టోబర్ 2ను పురస్కరించుకుని కేసీఆర్‌కు కృతజ్ఞతగా మల్లంపల్లి మండలం భాగ్యనగర్ తండాలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

అక్టోబర్ 2న శుక్రవారం ఉదయం 10 గంటలకు భాగ్యనగర్ తండాలో నిర్వహించనున్న కార్యక్రమానికి మండల పార్టీ మాజీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. పేద కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థికంగా అండగా నిలిచే ఉద్దేశంతో తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకం ప్రాధాన్యతను ప్రజలకు వివరించడంతో పాటు, పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU