Jangaon: జనగామలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ!
Jangaon: జనగామ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి చేతుల మీదుగా చెక్కుల అందజేత.
Jangaon: జనగామలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ!
Jangaon: జనగామ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జనగామ మునిసిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ అతిధి గా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
జనగామ పట్టణానికి చెందిన 19 మంది, జనగామ రూరల్ ప్రాంతానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మునిసిపల్ ఛైర్పర్సన్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయంతో లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అందజేస్తుందని ఈ సందర్బంగా తెలియజేశారు.




