Palakurthi: పాలకుర్తిలో ఘనంగా కల్లుగీత కార్మిక సంఘం 69వ వార్షికోత్సవం!

Palakurthi: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం 69వ వార్షికోత్సవం సందర్భంగా మండల అధ్యక్షుడు కమ్మగాని పరుశరాములు గౌడ్ సంఘం జెండాను ఆవిష్కరించారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 19 Oct 2026 3:49 PM IST
Palakurthi
X

Palakurthi: పాలకుర్తిలో ఘనంగా కల్లుగీత కార్మిక సంఘం 69వ వార్షికోత్సవం!

పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం 69వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు కమ్మగాని పరుశరాములు గౌడ్ సంఘం జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుల ఐక్యత, హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం కోసం సంఘం చేస్తున్న కృషిని గుర్తుచేశారు. కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు, వారి కుటుంబాల సంక్షేమానికి అవసరమైన పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కల్లుగీత కార్మికుల హక్కుల సాధన కోసం సంఘం నాయకులు, సభ్యులు ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 69 సంవత్సరాలుగా కార్మికుల హక్కుల కోసం కొనసాగుతున్న సంఘం ప్రస్థానం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం నాయకులు, రాష్ట్ర నాయకులు కమ్మగాని నాగన్న, బండి కొండయ్య, కమ్మగాని శ్రీకాంత్ గౌడ్, కమ్మగాని సుధాకర్ గౌడ్, కమ్మగాని సారయ్య, కమ్మగాని సోమన్న, బండి భగవంతు, బండి మదర్, కమ్మగాని మల్లయ్య, కమ్మగాని దామోదర్, కమ్మగాని శ్రీనివాస్ గౌడ్, బీసు ఉప్పలయ్య, బండి రాజయ్య, సభ్యులు, స్థానిక గౌడ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI