Hanumakonda: బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక: రిజిస్ట్రార్ రాంచంద్రం!
Hanumakonda: కాకతీయ యూనివర్సిటీ మైక్రోబయాలజీ విభాగంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
Hanumakonda: బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక: రిజిస్ట్రార్ రాంచంద్రం!
Hanumakonda: ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రాంచంద్రం, హెడ్ డాక్టర్ సుజాత, వెంకటయ్య, ఈసీ మెంబర్ రామారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ మమత, సూర్యం, జ్యోతి, అవెన్యూ ప్లాంటేషన్ ఇంచార్జి డాక్టర్ బట్టి వెంకట గోపీనాథ్, విద్యార్థులు, పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రాంచంద్రం.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు.
మహిళలు ఐకమత్యంతో, ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం సంతోషకరమన్నారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని భావితరాలకు అందించడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.




