Bhupalpally: 29వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ముందు 29వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 10 Nov 2026 5:09 PM IST
Bhupalpally
X

Bhupalpally: 29వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె

భూపాలపల్లి: జయశంకర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 29వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

ఎన్నో సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, పెండింగ్ వేతన బకాయిల చెల్లింపు, పీఆర్సీ అమలు, వార్షిక ఇంక్రిమెంట్లు, లాయల్టీ బోనస్ వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్య సేవలు అందించిన తమ సేవలను ప్రభుత్వం గుర్తించాలని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం, తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు సమ్మెను కొనసాగిస్తామని nhm ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally