Bhupalpally: అశోక్‌రెడ్డి మంచితనానికి, సేవా గుణానికి ప్రజల నీరాజనాలు!

Bhupalpally: గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో ఒద్దుల అశోక్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనం. రామాలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించిన గ్రామస్తులు, అభిమానులు.

RAJU, BHUPALAPALLI
Published on: 19 Sept 2026 10:38 PM IST
Bhupalpally
X

Bhupalpally: అశోక్‌రెడ్డి మంచితనానికి, సేవా గుణానికి ప్రజల నీరాజనాలు!

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒద్దుల అశోక్‌రెడ్డి జన్మదిన వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై అశోక్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజలు వేడుకల్లో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.

గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ఆపదలో ఉన్న వారికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ అశోక్‌రెడ్డి అందరి మన్ననలు పొందుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆయన మృదుస్వభావం, సేవా దృక్పథం, ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మెలిగే తీరు తమను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.

అశోక్‌రెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

RAJU, BHUPALAPALLI

RAJU, BHUPALAPALLI