Bhupalpally: 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఎక్కడ? బీఆర్ఎస్ నేతల ఆగ్రహం!

Bhupalpally: ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు కటకం జనార్దన్ ఆరోపించారు.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 18 Nov 2026 3:47 PM IST
Bhupalpally
X

Bhupalpally: 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఎక్కడ? బీఆర్ఎస్ నేతల ఆగ్రహం!

భూపాలపల్లి: 420 హామీలు.. ఆరు గ్యారెంటీలు.. 13 డిక్లరేషన్లు.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు కటకం జనార్దన్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

గృహజ్యోతి, రైతు భరోసా, కౌలు రైతులకు పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా, పెన్షన్ల పెంపు వంటి హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.. 13 డిక్లరేషన్లను సైతం పక్కనపెట్టి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally