Jangaon: జనగామ జిల్లాలో ప్రశాంతంగా మీ-సేవా కేంద్రాల నియామక రాత పరీక్ష!
Jangaon: జనగామ జిల్లాలో 17 నూతన మీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో నిర్వహించిన రాత పరీక్షకు 584 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
Jangaon: జనగామ జిల్లాలో ప్రశాంతంగా మీ-సేవా కేంద్రాల నియామక రాత పరీక్ష!
Jangaon: జిల్లాలో 17 నూతన మీ-సేవా కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ కోసం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో రాత పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించారు.
ఈ నియామక ప్రక్రియకు మొత్తం (663) దరఖాస్తులు రాగా, పరిశీలన అనంతరం (638) మంది అభ్యర్థులు పరీక్షకు అర్హులుగా (Eligible Candidates) ఎంపికయ్యారు.
పరీక్షకు అర్హత పొందిన (638) మందిలో (584) మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, (54) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీ సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.




