Jangaon: విలాస్‌నగర్‌లో భక్తిశ్రద్ధలతో మహిళల కుంకుమ పూజలు

Jangaon: జనగామ విలాస్‌నగర్ కాలనీలో భక్తిశ్రద్ధలతో జరిగిన వినాయకుడి కుంకుమ పూజ. ఆధ్యాత్మిక శోభతో విలసిల్లిన వేడుకలు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 21 Sept 2026 4:52 PM IST
Jangaon
X

Jangaon: విలాస్‌నగర్‌లో భక్తిశ్రద్ధలతో మహిళల కుంకుమ పూజలు

జనగామ: జనగామ పట్టణ విలాస్‌నగర్‌ కాలనీలోని వినాయకుడి మండపం వద్ద మహిళల ఆధ్వర్యంలో కుంకుమ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుంకుమ పూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

మహిళల భక్తి, పూజా కార్యక్రమాలతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నిర్వాహకులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రావణి, నాగక్క, మంజుల, భాగ్య, కమల, యశోద, పావని, కల్పన, లలిత, సరిత, మమత, పద్మ, కళావతి తదితర మహిళలు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON