Jangaon: వృద్ధ మహిళ అనుమానాస్పద మృతి - కొడుకు, కోడలు అరెస్ట్

Jangaon: జనగామ జిల్లా కడవెండిలో వృద్ధ మహిళ మృతి కేసులో కొడుకు, కోడలు అరెస్ట్. కుటుంబ గొడవలతోనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి.

S MAHENDER, PALAKURTHI
Published on: 16 Sept 2026 9:00 PM IST
Jangaon
X

Jangaon: వృద్ధ మహిళ అనుమానాస్పద మృతి - కొడుకు, కోడలు అరెస్ట్

జనగామ జిల్లా: దేవరుప్పుల మండలం,కడవెండి గ్రామంలో వృద్ధ మహిళ అనుమానాస్పద మృతి ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.పోలీసుల వివరాల ప్రకారం మృతురాలు ఉపేంద్ర (వయస్సు వివరాలు దర్యాప్తులో నిర్ధారించవలసి ఉంది).ఆమె తన కుమారుడు పెందొట వెంకటేశ్వర్లు, S/Oసోమనర్సయ్య,వయస్సు 54 సంవత్సరాలు,వృత్తి:గోల్డ్ వర్క్, ప్రస్తుతం కడవెండి గ్రామంలో నివసిస్తున్న ఇంటికి సుమారు నాలుగు నెలల క్రితం వచ్చినట్లు సమాచారం.

కుటుంబంలో తరచుగా జరుగుతున్న గొడవలు, మృతురాలి పట్ల ఉన్న విభేదాల నేపథ్యంలో 08.09.2026 రాత్రి వెంకటేశ్వర్లు,అతని భార్య పెందొట వనిత, W/o వెంకటేశ్వర్లు, వయస్సు 31 సంవత్సరాలు మృతురాలిపై దాడి చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.అనంతరం ఆమె మృతి చెందినట్లు నిందితులు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.

మృతురాలి మరణాన్ని అనారోగ్యం కారణంగా జరిగినట్లుగా చూపించి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది.అయితే మృతురాలి శరీరంపై గాయాల గుర్తులు కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామకు తరలించారు.

తదుపరి, పోస్టుమార్టం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భయంతో నిందితులు కడవెండి గ్రామ సర్పంచ్ బషిపాక రాములును సంప్రదించి జరిగిన విషయాన్ని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.సర్పంచ్ ఇద్దరు నిందితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి అప్పగించగా, నిందితులు పోలీసుల ఎదుట తమకు తెలిసిన విషయాలను వెల్లడించారు.తర్వాత పాలకుర్తి సిఐ భరత్ సుమన్ వారిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం జనగామ కోర్టు యందు హాజరు పరిచారు.ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల ఎస్సై సృజన్ కుమార్,సిబ్బంది పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI