Jangaon: ఆసరా పింఛన్ కోసం 23 కి.మీ ప్రయాణం.. వృద్ధుల అవస్థలు!

Jangaon: స్టేషన్ ఘన్‌పూర్ మండలం రంగరాయకొండలో ఆసరా పింఛన్‌ కోసం 11 మంది వృద్ధులు నెలకు 23 కి.మీ ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. స్వగ్రామానికి బదిలీ చేయాలని వేడుకోలు.

V Ravikiran, Jangaon
Published on: 27 Oct 2026 8:28 PM IST
Jangaon
X

Jangaon: ఆసరా పింఛన్ కోసం 23 కి.మీ ప్రయాణం.. వృద్ధుల అవస్థలు!

జనగామ, అక్టోబర్‌ 27: ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ కోసం వృద్ధులు వికలాంగులు అవస్థలు పడుతున్నారు. స్టేషన్ ఘనపూర్ మండలం రంగరాయకొండ గ్రామానికి చెందిన 11 మంది వృద్ధులు వికలాంగుల పేర్లు ఇదే మండలంలో తాడికొండ గ్రామం లో నమోదు కాగా ప్రతినెల పెన్షన్ కోసం వారు ఆటోలో వెళ్లి పెన్షన్ తీసుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వయసు మీద పడి మోకాళ్ళు నొప్పులతో నడవలేక ప్రాకుతూ పింఛన్‌ డబ్బుల కోసం ప్రతి నెలా 23 కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌, సంబంధిత అధికారులు స్పందించి తమ పింఛన్‌ వివరాల్లో తమ గ్రామానికి మార్చి స్వగ్రామంలోనే పింఛన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

రంగారాయిగూడెం గ్రామానికి చెందిన మంద వెంకట నర్సయ్య, మంద సమ్మక్క, ఈరగొని ఉప్పలయ్య, బోట్ల ఎల్లమ్మ సహా మొత్తం 11 మంది పింఛన్‌దారులు ప్రతినెల పెన్షన్ కోసం 200 రూపాయల ఖర్చు చేస్తూ ఆటోలో పోయి వస్తున్నట్లు వారు తెలిపారు. తమ సమస్యను సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించిన పరిష్కారం కాలేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

V Ravikiran, Jangaon

V Ravikiran, Jangaon