Jangaon: మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌ను కలిసిన ఎస్‌పీఎస్ నేతలు!

Jangaon: జనగామ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌ను కలిసిన ఎస్‌పీఎస్ నేతలు. కాంట్రాక్ట్ సిబ్బందికి నెలకు కనీసం రూ.25వేల వేతనం చెల్లించాలని ఏనుగుల రఘు విజ్ఞప్తి.

MD AHMAD PASHA, JANGAON
Published on: 28 Oct 2026 6:50 PM IST
Jangaon
X

Jangaon: మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌ను కలిసిన ఎస్‌పీఎస్ నేతలు!

జనగామ: బుధవారం మధ్యాహ్నం జనగామ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ కె. నాగమణిని ఎస్‌పీఎస్ జనగామ జిల్లా కమిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ను శాలువాతో సత్కరించారు.

అనంతరం ఎస్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఏనుగుల రఘు మాట్లాడుతూ, బెడ్‌సైడ్ కాంటాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా హెచ్‌ఎఫ్‌ఎంఐఎస్ నుంచి ఐఎఫ్‌ఎంఐఎస్ విధానంలోకి మార్చాలని, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

సిబ్బందికి ప్రతి నెలా కనీసం రూ.25,000 వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌ను కోరారు. కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు చొరవ చూపాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు స్వామి, సునీత, రజిత, అఖిల, గోపాలకృష్ణ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON