Jangaon: కుంగ్ ఫూ, చెస్ పోటీల్లో సేజ్ హైస్కూల్ విద్యార్థుల ఘన విజయం!
Jangaon: చైనీస్ కుంగ్ ఫూ, చదరంగం పోటీల్లో జనగామ సేజ్ హైస్కూల్ విద్యార్థుల ప్రభంజనం కాజీపేటలో 8 మందికి 8 పతకాలు, విజేతలను అభినందించిన కరస్పాండెంట్ రోహన్ రెడ్డి.
Jangaon: కుంగ్ ఫూ, చెస్ పోటీల్లో సేజ్ హైస్కూల్ విద్యార్థుల ఘన విజయం!
జనగామ: జనగామ సేజ్ హై స్కూల్ విద్యార్థులు చైనీస్ కుంగ్ ఫూ మరియు చదరంగం పోటీలలో అద్భుతమైన ప్రతిభను కనబరిచి పలు పతకాలు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. ముఖ్యంగా చైనీస్ కుంగ్ ఫూ పోటీలలో పాల్గొన్న ఎనిమిది మంది విద్యార్థులు పతకాలు సాధించడం విశేషం న్యూ స్టార్ చైనీస్ కుంగ్ ఫూ ఆధ్వర్యంలో కాజీపేటలో నిర్వహించిన చైనీస్ కుంగ్ ఫూ పోటీలలో సేజ్ హై స్కూల్‌కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారు.
బంగారు పతక విజేతలు
K. అభిరామ్, P. దివ్యాంశ్, N. తాన్విష్, B. తానిష్
వెండి పతక విజేతలు
L. వరుణ్, M. వర్ధన్, 🥉 కాంస్య పతక విజేతలు, P. రుద్రాంశ్, N. చరిత్.
పాల్గొన్న ఎనిమిది మంది విద్యార్థులు ఎనిమిది పతకాలు సాధించడం పాఠశాల విజయాలలో మరో మైలురాయిగా నిలిచింది అదేవిధంగా చదరంగం పోటీలలో కూడా సేజ్ హై స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి విజయాలు సాధించారు.
క్రీడలతో పాటు మేధో వికాసానికి కూడా పాఠశాల ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులను వివిధ పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తోంది ఈ సందర్భంగా సేజ్ హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ వాదిరెడ్డి రోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి సరైన వేదికను కల్పిస్తూ విద్యతో పాటు క్రీడలు చదరంగం సాంస్కృతిక మరియు ఇతర సహపాఠ్య కార్యక్రమాలలో ప్రోత్సహించడం పాఠశాల ప్రధాన లక్ష్యాలలో ఒకటని పేర్కొన్నారు
ప్రతి విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి వారికి సరైన వేదికను అందించడం ద్వారా మరిన్ని విజయాల వైపు నడిపించడమే మా లక్ష్యం అని పాఠశాల యాజమాన్యం తెలిపింది ఈ సందర్భంగా విజయాలు సాధించిన విద్యార్థులను అభినందించారు విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తూ, వారికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
భవిష్యత్తులో కూడా సేజ్ హై స్కూల్ విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మరియు జనగామకు గర్వకారణంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు విజయాలు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు మరియు సిబ్బంది హృదయపూర్వకంగా అభినందించారు.




