Jangaon: బతుకమ్మ వేడుకల్లో ప్రోటోకాల్ రగడ సిగ్గుచేటు: బీజేపీ ఫైర్!

Jangaon: జనగామ సద్దుల బతుకమ్మ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదంతో మహిళలను ఆడుకోనివ్వకుండా గొడవ చేయడం సిగ్గుచేటని బీజేపీ నేత కేవీఎల్‌ఎన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 19 Oct 2026 6:07 PM IST
Jangaon
X

Jangaon: బతుకమ్మ వేడుకల్లో ప్రోటోకాల్ రగడ సిగ్గుచేటు: బీజేపీ ఫైర్!

జనగామ జిల్లా: బిజేపి జనగామ పట్టణ అధ్యక్షులు అనిల్ గౌడ్ ఆధ్వరయంలో ప్రేస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో నగరుకర్నూల్ జిల్లా ఇన్చార్జి kvln రెడ్డి గారు మాట్లాడుతూ జనగామ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత ప్రోటోకాల్ వివాదం తెరలేపి మహిళలను బతుకమ్మ ఆడుకోనివ్వకుండా చేయడం సిగ్గు చేటు అని తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తిన రాష్ట నాయకులు kvln రెడ్డి రాజు.

జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో నిన్న నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొల్పి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ బిఆర్ఎస్.

చేర్యాల మార్కెట్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ని స్టేజ్ పైకి ఆహ్వానించాలని కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నించడం అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే వర్గీయులతో కూడా మాటల యుద్ధం మొదలుపెట్టి. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసి బతుకమ్మ ఆడుకోకుండా చేశారు.

బతుకమ్మ వేడుకలకు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వల్ల జేబులకెళ్ళి డబ్బులు ఇవ్వడం లేదు మీరు ఎవ్వరు మహిళలను బతుకమ్మ ఆడుకొనియ్యకుండా చెయ్యడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల సొమ్ముతోనే బతుకమ్మ వేడుకలు నడుస్తున్నాయి. బతుకమ్మ ఆడవాళ్ళ పండుగ కాబట్టి వాళ్లను ఆడుకొనివ్వకుండా ఎలా చేస్తారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ రాజ్ యాదవ్ జిల్లా కార్యదర్శి వల్లల వెంకటేష్ జిల్లా నాయకుల గొరిగే సంపత్ పట్టణ ఉపఅధ్యక్షులు బింగి రమేష్ తదితరులు పాల్గోన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON