Jangaon: బతుకమ్మ వేడుకల్లో ప్రోటోకాల్ రగడ: ఎమ్మెల్యే పల్లాపై కొమ్మూరి ఫైర్!

Jangaon: జనగామ బతుకమ్మ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదంపై మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీరును తప్పుబట్టారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 19 Oct 2026 7:46 PM IST
Jangaon
X

Jangaon: బతుకమ్మ వేడుకల్లో ప్రోటోకాల్ రగడ: ఎమ్మెల్యే పల్లాపై కొమ్మూరి ఫైర్!

జనగామ: జనగామ జిల్లా లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వివాదంపై మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీరును ఖండిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి భార్య బతుకమ్మ వేడుకల వేదికపై నుంచి శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్నలు కురిచాపించారు. బతుకమ్మపండుగను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని హితవు పలికారు. అంతేకాకుండా, బీఆర్ఎస్ పాలనతో పాటు ఎమ్మెల్యే పల్లా వ్యవహారశైలిపై పలు ఆరోపణలు చేశారు.

బతుకమ్మ పండుగకు రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై మహిళలకు శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీ అని ఆయన అన్నారు. బతుకమ్మ కుంట ప్రభుత్వ వేదిక కాదని, శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారిని ప్రోటోకాల్ పేరుతో అడ్డుకోవడం సరికాదని విమర్శించారు.

గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి భార్య బతుకమ్మ వేడుకల వేదికపై నుంచి శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రస్తావించారు. ఆమెకు ఏ హోదా ఉందని, ఏ ప్రోటోకాల్ ప్రకారం వేదికపైకి వచ్చారని ప్రశ్నించారు. గతంలో జరిగిన విషయాలను మర్చిపోయి ఇప్పుడు ప్రోటోకాల్ పేరుతో వివాదం సృష్టించడం ఏమిటని పల్లా రాజేశ్వర్ రెడ్డిని నిలదీశారు.

ప్రజలకు సేవ చేస్తే ప్రజలే గౌరవం ఇస్తారని, పండుగ వేడుకల్లో రాజకీయాలకు తావివ్వకూడదని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు.

ఇక బీఆర్ఎస్ పదేళ్ల పాలనపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత ప్రభుత్వం పనిచేయలేదని ఆరోపించారు. ప్రస్తుత ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.

జనగామలో దొంగ ఓట్లు నమోదయ్యాయంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆరోపణలు చేసిన ఆయన.. ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల వ్యవహారంపై చేసిన ఆరోపణలకు సంబంధించి అధికారిక వివరాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

జనగామ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని పల్లా రాజేశ్వర్ రెడ్డిని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON