Palakurthi: పాలకుర్తిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్!
Palakurthi: జనగామ జిల్లా పాలకుర్తిలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన ఇద్దరు యువకులను పోలీసులు కోర్టు ఆదేశాలతో జనగామ డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. ఎస్‌ఐ సృజన్ కుమార్ వివరాలు వెల్లడించారు.
Palakurthi: పాలకుర్తిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్!
పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వల్మిడి గ్రామానికి చెందిన సొహైల్, పాలకుర్తికి చెందిన కౌశిక్‌లకు గంజాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, 15 రోజుల పాటు జనగామ డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు పాలకుర్తి ఎస్ఐ సృజన్ కుమార్ వెల్లడించారు.
యువత చెడు వ్యసనాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గంజాయి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నా లేదా సేవిస్తున్నా.. ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు నేరుగా గానీ, ఫోన్ ద్వారా గానీ అందించవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ తెలిపారు.




