Jangaon: వ్యవసాయ రంగ పరిరక్షణకు రైతులు ఏకం కావాలి: సోమయ్య!

Jangaon: నల్గొండలో జరిగే అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పాలకుర్తిలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య పిలుపునిచ్చారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 11 Nov 2026 5:25 PM IST
Jangaon
X

Jangaon: వ్యవసాయ రంగ పరిరక్షణకు రైతులు ఏకం కావాలి: సోమయ్య!

జనగామ: ఈనెల 15 నుంచి 18 తేదీ వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య పిలుపునిచ్చారు. బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రజా సంఘాల సమావేశం శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షురాలు బచ్చు శ్రీలత అధ్యక్షత వహించగా సోమయ్య పాల్గొని మాట్లాడుతూ రైతాంగ హక్కుల సాధన వ్యవసాయ రంగం పరిరక్షణ కోసం ఏఐకేఎస్ నిరంతరం పోరాడుతుందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 13 నెలల పాటు సాగిన చారిత్రక రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిందని తెలిపారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యవసాయ రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు అందించాలని, కరువు ప్రాంతాల్లో పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు, కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో విదేశాల నుండి వ్యవసాయ ఉత్పత్తులకు సుంకాలు లేకుండా దిగుమతికి అవకాశం ఇచ్చి దేశ రైతులను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. సాదా బైనామ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కౌలు రైతులను గుర్తించాలని కోరారు,ఈనెల 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభకు రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్యాల సోమన్న, ఉపాధ్యక్షులు సొమసత్యం, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి మదార్, ఏవో ఐ (ఎల్ఐసి) రాష్ట్ర నాయకులు సోమ అశోక్ బాబు, రైతు సంఘం మండల కార్యదర్శి బెల్లి సంపత్, కెవిపిఎస్ జిల్లా నాయకులు కాకర్ల రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు కాకర్ల పద్మ, అధ్యక్షులు కాకర్ల బాబు, సిఐటియు నాయకులు మాసంపల్లి నాగయ్య, రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు ముస్కు ఇంద్రారెడ్డి, అనపర్తి శోభన్, కే రేణుక, ఎల్లమ్మ, చంద్రయ్య, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI